ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 15:55:59

మిషన్ భగీరథ - జల్ జీవన్ మిషన్ ప‌థ‌కాల మ‌ధ్య ప్ర‌ధాన తేడాలివే..

మిషన్ భగీరథ - జల్ జీవన్ మిషన్ ప‌థ‌కాల మ‌ధ్య ప్ర‌ధాన తేడాలివే..

హైద‌రాబాద్ : మన మిషన్ భగీరథ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం కూడా 'జల్ జీవన్ మిషన్'ను పథకాన్ని రూపొందించింది అని పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. దానికి కావాల్సిన టెక్నాలజీని ఇంజనీరింగ్ విధానం కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులు మన రాష్ట్రానికి ఎన్నోసార్లు వచ్చి స్టడీ చేయడం జరిగింది. ఇంటింటికి నీళ్లు ఇచ్చే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇటీవల ఇచ్చిన ర్యాంకింగ్ లో 98 శాతంతో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది. కేంద్రం సహా, అనేక రాష్ట్రాలు మిషన్ భగీరథ పథకాన్నే వేర్వేరు పేర్లతో దాదాపు యథాతథంగా అమలు చేస్తున్న మన పథకంపై, మన రాష్ట్రంపై కేంద్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదో కేంద్రం చెప్పాలి అని ద‌యాక‌ర్ రావు డిమాండ్ చేశారు. 

ఈ రెండు ప‌థ‌కాల మ‌ధ్య తేడాలు : 

- మనం మిషన్ భగీరథ కోసం గోదావరి, కృష్ణా నదుల నీటిని వాడుతున్నం.

- కేంద్ర ప్రభుత్వం జల్ శక్తి జీవన్ మిషన్ పథకానికి బోర్ వెల్స్ నీటిని మాత్రమే వాడుతుంది. 

- మనం భూ  ఉపరితల నీటిని స్వచ్ఛంగా, ఫిల్టర్ చేసి అందిస్తున్నం

- వాళ్ళు... ఫిల్టర్ లేకుండా బోర్ నీటిని అందిస్తున్నరు. దీని వల్ల ఫ్లోరైడ్, ఇతరత్రా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 


- మనం మన రాష్ట్రంలో 45వేల కోట్లు ఖర్చు చేస్తున్నం.

- జల్ శక్తి జీవన్ మిషన్ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా... 3లక్షల 60వేల లక్షల కోట్లు ఖర్చు చేసి, ఈ పథకాన్ని 2024 నాటి కల్లా పూర్తి చేయాలని నిర్ణయించారు.

- కానీ, ఈ ఏడాది కేవలం 22వేల 813 కోట్లు మాత్రమే విడుదల చేశారు.


- మన రాష్ట్రంలో 98.4శాతం గృహాలకు మంచినీరు అందిస్తున్నం.

- గుజరాత్ లాంటి రాష్ట్రంలో పథకం 10ఏళ్ళ క్రితం మొదలైనా..ఇప్పటికీ 80శాతం పనులు కూడా పూర్తి కాలేదు.

- రాష్ట్రంలో మొత్తం 1 లక్షా 47వేల కి.మీ. మేర పైపులైన్ వేసి, ఇంటింటికీ నీరందిస్తున్నం. ఇది భూగోళం చుట్టుకొలతకు మూడు రెట్లు ఎక్కువ.


- గుజరాత్ రాష్ట్రంలో చేపట్టిన ఇదే తరహా పథకానికి వాళ్ళు 1/3 నీటిని మాత్రమే నర్మదా నది నుంచి తీసుకుంటున్నరు.

- మిగతా 1/4 నీటిని బోర్ వెల్స్ ద్వారానే తీసుకుంటున్నరు. దీంతో ఫ్లోరైడ్ వంటి ఇతర సమస్యలు అక్కడా వచ్చే అవకాశం ఉంది.

-మనం మిషన్ భగీరథ కోసం 35వేల 160 ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించినం. ఇందుకు 187 మెగా వాట్ల విద్యుత్ ని వాడుతున్నం


-జల్ జీవన్ శక్తి పథకం కింద గుజరాత్ కి ఇప్పటికీ... 883 కోట్లు ఈ సంవత్సరానికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వం... మనం అడిగిన  నిర్వహణా ఖర్చులు కూడా నయా పైసా ఇవ్వలేదు.

-ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 5.78శాతం మాత్రమే పనులు పూర్తి అయ్యాయి. కేటాయించిన నిధులు మాత్రం రూ. 2వేల 550 కోట్లు.