మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 12:42:17

క‌రోనా ల‌క్ష‌ణాలు లేనివారితో వైర‌స్ వ్యాప్తి త‌క్కువే

క‌రోనా ల‌క్ష‌ణాలు లేనివారితో వైర‌స్ వ్యాప్తి త‌క్కువే

హైద‌రాబాద్‌: క‌రోనా ల‌క్ష‌ణాలు లేనివారి నుంచి వైర‌స్ వ్యాప్తి త‌క్కువేన‌ని హైద‌రాబాద్ డీఎంహెచ్ఓ వెంక‌ట్ అన్నారు. కొంద‌రిలో ల‌క్ష‌ణాలు లేకున్నా క‌రోనా పాజిటివ్ వ‌స్తున్న‌ద‌ని చెప్పారు. క‌రోనా రోగుల‌తో స‌న్నిహితంగా ఉన్న‌వారు త‌ప్ప‌నిస‌రిగా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. క‌రోనా బాధితులు చాలా బాధ్య‌తాయుతంగా మెల‌గాల‌ని, కొంద‌రు బాధ్య‌త లేకుండా బ‌య‌ట తిరుగుతున్న‌ట్లు తెలిసింద‌ని చెప్పారు. 

హైద‌రాబాద్‌లో క‌రోనా ప‌రీక్ష‌లు విస్తృతం చేశామాని ప్ర‌క‌టించారు. న‌గ‌రంలో 65 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజ‌న్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. అన్ని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో ప‌రీక్ష‌ల కోసం  ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న ఎవ‌రైనా యాంటిజన్ ప‌రీక్ష‌లు చేయించుకోవ‌చ్చ‌ని తెలిపారు. 

హోం ఐసోలేష‌న్ వ‌స‌తి లేనివారు ప్ర‌భుత్వ ఐసోలేష‌న్‌లో ఉండ‌వ‌చ్చ‌ని సూచించారు. హోం ఐసోలేష‌న్‌లో ఉండేవారికి మందుల‌తోకూడిన కిట్ ఇస్తున్నామ‌ని చెప్పారు. న‌గ‌రంలో ఇప్ప‌టివ‌ర‌కు 11,705 మంది హోం ఐసోలేష‌న్‌లో ఉన్నార‌ని తెలిపారు. హోం ఐసోలేష‌న్ చికిత్స తీసుకుంటున్న‌వారికి ఫోన్ ద్వారా డాక్ట‌ర్లు సూచ‌న‌లు అందిస్తున్నార‌ని చెప్పారు. ప్ర‌భుత్వం టెలి మెడిసిన్ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింద‌న్నారు. క‌రోనా చికిత్స సందేహాల‌కు టోల్‌ఫ్రీ నంబ‌ర్‌ 18005994455లో సంప్ర‌దించ‌వచ్చ‌ని వెల్ల‌డించారు. logo