శుక్రవారం 29 మే 2020
Telangana - Apr 10, 2020 , 13:32:35

ప్రీపేయిడ్‌ విద్యుత్‌ మీటర్లు వచ్చేస్తున్నాయ్‌

ప్రీపేయిడ్‌ విద్యుత్‌ మీటర్లు వచ్చేస్తున్నాయ్‌

మీ ఫోన్ నెంబ‌ర్‌కు ఆధార్ లింక్ చేసుకున్నారా? బ‌్యాంకుకు? గ‌్యాస్ ఏజెన్సీలో? మ‌రి మీ విద్యుత్‌మీట‌ర్‌కు ఆధార్ లింక్ చేసుకున్నారా?  క‌పోతే చేసుకోండి మ‌రి?

భ‌విష్య‌త్ మొత్తం ప్రీపెయిడ్ విధానానిదే. విద్యుత్ మీట‌ర్ల‌కూ ముందుగా రీచార్జి చేసుకునే వెసులుబాటును క‌ల్పిస్తున్న‌ది విద్యుత్ శాఖ‌. ఇందుకోసం ఇప్ప‌టికే ప్రీపెయిడ్ మీట‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్ప‌టికే కొన్ని జిల్లాల్లో ఇది అమ‌ల‌వుతున్న‌ది.. రాష్ట్ర‌మంత‌టా అమ‌లుచేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మీ విద్యుత్ మీట‌ర్‌కు ఆధార్, ఫోన్ నెంబ‌ర్ అనుసంధానం చేసుకోవ‌చ్చు. మీ మొబైల్‌లో https://bit.ly/2Rpz7qL లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. నార్త‌ర్న్ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ పేరుతో సైట్ ఓపెన్ అవుతుంది. అందులో స‌ర్కిల్ కోడ్‌, ఈఆర్‌వో కోడ్‌, క‌న్సూమ‌ర్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత స‌బ్‌మిట్ చేయాలి. ఆ త‌ర్వాత ఆధార్‌, మొబైల్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది.  అంతే మీ ముబైల్ నెంబ‌ర్‌, ఆధార్ విద్యుత్ మీట‌ర్‌కు అనుసంధానం అవుతుంది.


logo