గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 16:33:40

ధర్మారం సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్న: మంత్రి కొప్పుల

ధర్మారం సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్న: మంత్రి కొప్పుల

పెద్దపల్లి : ధర్మారం మండల సమగ్రాభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మారం మండల కేంద్రంలో ఎల్.ఎం. కొప్పుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గాంధీజీ విగ్రహాన్ని శుక్రవారం మంత్రి ఆవిష్కరించారు. గాంధీజీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని వీలైనంత వరకు వెడల్పు చేసి అత్యాధునిక వీధి దీపాలను ఏర్పాటు చేసుకుందామన్నారు. మండల అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీనిచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. logo