గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 22:04:59

ఘనంగా నృసింహుడి ఉత్తర దిగ్యాత్ర

ఘనంగా నృసింహుడి ఉత్తర దిగ్యాత్ర

ధర్మపురి : ధర్మపురి క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మినరసింహస్వామి వారి ఉత్తర దిగ్యాత్ర కార్యక్రమం గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి(యోగ,ఉగ్ర) వారల ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి బయటకు తీసుకవచ్చి సాయంత్రం వేళలో సేవలపై ఉంచారు. ఉత్తర దిగ్యాత్రలో భాగంగా ఉత్తరాన ఉన్న ఉసిరిక వాగు వద్దకు సేవలను తీసుకెల్లారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద స్వామివారల సేవలను ఉంచి వేదపండితులు బొజ్జ రమేశ్‌ శర్మ మంత్రోచ్చరణల మద్య దిగ్యాత్ర పూజలు చేశారు. ఇక్కడ భక్తులు స్వామివారలను దర్శించుకున్నారు. 

రాత్రి వేళలో స్వామివారల సేవలు తిరిగి ఆలయానికి తీసుకవచ్చారు. యాజ్ఙాచార్యులు కందాళై పురుషోత్తమాచార్యుల నేతృత్వంలో ఆలయ ముఖ్య అర్చకులు శ్రీనివాసాచార్య, నరసింహమూర్తి, రమణాచార్య తదితరులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్తెమ్మ, దేవస్థానం సూపరింటెండెంట్‌ ద్యావళ్ల కిరణ్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌, దేవస్థానం సిబ్బంది తదితరులున్నారు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శుక్రవారం సాయంత్రం వేంకటేశ్వర స్వామివారి ఉత్తర, దక్షిణ దిగ్యాత్రలు, రాత్రి వేళ భోగమండప ఉత్సవం నిర్వహించనున్నారు. logo
>>>>>>