గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 21:30:45

వైభవంగా లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాలు

వైభవంగా లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాలు

ధర్మపురి : ధర్మపురి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ధర్మపురి శ్రీలక్ష్మీనర్సింహస్వామి (యోగ)తెప్పోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. తెప్సోత్సవం సందర్భంగా బ్రహ్మ పుష్కరిణి(కోనేరు)కి రంగులు వేసి, విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. దేవాలయం నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలను కోనేరు వరకూ ఊరేగింపుగా తీసకువచ్చి అందంగా అలంకరించారు. హంసవాహనంలో ఉత్సవ మూర్తులను ఉంచి కోనేరులో ఐదు ప్రదక్షిణలు చేయించారు. గోవిందనామ స్మరణతో కోనేరు ప్రాంగణమంతా మార్మోగింది. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం డోలోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం రాత్రి 9గంటల వరకూ కొనసాగగా... భక్తులు క్యూలైన్లో వచ్చి స్వామివారినిక దర్శించుకున్నారు. స్వామివారిని మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు.

 

* భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు: మంత్రి కొప్పుల 

ప్రాచీన పుణ్యక్షేత్రమైన ధర్మపురి క్షేత్రంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. ఏర్పాట్లపై దాదాపు రెండు నెలల నుంచి దేవస్థాన సిబ్బందితో పాటు వివిధ శాఖల అధికారులను ముందస్తుగా అప్రమత్తం చేసినట్లు వివరించారు. డోలోత్సవం కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ రాజేశం, డీసీసీబీ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సంగి సత్తెమ్మ, నాయకులు పాల్గొన్నారు. 


logo