బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 01:32:17

కీసర కేసులో మరో నిందితుడి ఆత్మహత్య

కీసర కేసులో మరో నిందితుడి ఆత్మహత్య

  • ఉరివేసుకున్న కందాడి ధర్మారెడ్డి 

కీసర: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తాసిల్దార్‌ అవినీతి కేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ భూ వివాదంలో అప్పటి కీసర తాసిల్దార్‌ నాగరాజు రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. కేసు విచారణ జరుగుతున్న క్ర మంలో చంచల్‌గూడ జైలులో అండర్‌ ట్రయల్‌ ఖైదీ గా ఉన్న నాగరాజు గత నెల 14న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నెలరోజులు గడువక ముందే ఇదే కేసుకు సంబంధించిన మరో నిందితుడు కందాడి ధర్మారెడ్డి(70) బలవన్మరణానికి పాల్పడ్డా డు. మూడురోజుల క్రితం బెయిల్‌పై వచ్చిన ధర్మారెడ్డి ఆదివారం తెల్లవారు జామున కుషాయిగూడ వాసవి నగర్‌లోని శివాలయ ప్రాంగణంలో చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు. మేడ్చల్‌ జిల్లా కీసర మండలం రాంపల్లిదాయర గ్రామానికి చెందిన ధర్మారెడ్డి బతుకుదెరువు కోసం వచ్చి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. రాంపల్లి దాయరలోని సర్వే నంబర్‌ 621 నుంచి 635 వరకు 90 ఎకరాలకు సం బంధించి టెనెంట్‌ కేసు ఉన్నదని ధర్మారెడ్డి అప్పటి తాసిల్దార్‌ దివంగత నాగరాజును కలిశాడు. అప్పట్లోనే దాని మీద ఉన్న పీటీని రద్దు చేయించుకున్నాడు. నాగరాజు నుంచి 24 ఎకరాల భూమికి నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. నాగరాజు కేసు విచారణ సమయంలో ఈ విషయం ఏసీబీ దృష్టికి వచ్చింది. దీంతో ధర్మారెడ్డిని, అతడి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డిని అరెస్టు చేశారు. 33 రోజులు జైలులో ఉన్న ధర్మారెడ్డి ఇటీవలే బెయిల్‌పై  వచ్చాడు. కాగా శ్రీకాంత్‌రెడ్డికి ఇంకా బెయిల్‌ లభించలేదు.