గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 01:34:03

ధరణి రిజిస్ట్రేషన్లు 12,705

ధరణి రిజిస్ట్రేషన్లు 12,705

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జోరందుకుంటున్నది. ధరణి పోర్టల్‌కు విశేష స్పందన లభిస్తున్నది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు చేసుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. కేవలం 10 రోజుల్లోనే 12,705 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటికి 8,488 రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు కాగా, బుధవారం సాయంత్రానికి ఆ సంఖ్య 12,705కు చేరుకున్నది. అంటే రెండ్రోజుల్లోనే 4,217 రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మూడ్రోజులుగా సగటున రెండువేలకు మించి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ధరణి మొదలుపెట్టిన తొలిరోజు ఒకటి, రెండు డాక్యుమెంట్లు చేసిన చాలామంది తాసిల్దార్లు.. ఇప్పుడు పది రిజిస్ట్రేషన్లకు తక్కువ చేయడంలేదు. హైదరాబాద్‌ చుట్టుపక్కల మండలాలు, జిల్లాలతోపాటు  భూముల క్రయవిక్రయాలు ఎక్కువగా జరిగే పలు ప్రాంతాల్లోని తాసిల్‌ ఆఫీస్‌లలో రోజూ 10 రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

ఇప్పటివరకు జరిగిన రిజిస్ట్రేషన్లు

తేదీ    డాక్యుమెంట్లు

2 507

3 543

4 905

5 1,193

6 1,520

7 1,535

9 2,285

10 ,11 4,217