మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 16:54:56

‘మల్లన్న’ ఆలయంలో ధన్వంతరి హోమం, ఏకాదశ రుద్రాభిషేకం

‘మల్లన్న’ ఆలయంలో ధన్వంతరి హోమం, ఏకాదశ రుద్రాభిషేకం

సిద్దిపేట : రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు.. కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయంలో సోమవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి గర్భాలయంలో మల్లన్నకు ఏకాదశ రుద్రాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం ధన్వంతరి, మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్‌ మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌ ఆదేశాల మేరకు ఆలయ ఏఈవో, సిబ్బంది ఆధ్వర్యంలో కరోనా వైరస్‌ నివారణ కోసం ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించినట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ అనంతరం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివస్తుండంతో వారికి కరోనా సోకకుండా ఉండేందుకు నివారణ చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


logo