శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 14:39:07

కొమురంభీం ఆసిఫాబాద్ లో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన

కొమురంభీం ఆసిఫాబాద్ లో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన

హైద‌రాబాద్ : రాష్ర్ట డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి నేడు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో డీజీపీ వెంట ఇంటలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ , గ్రేహౌండ్స్ డీజీ  కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు  బండి ప్రకాష్ , మెడం భాస్కర్ , వర్గీష్ లు తెలంగాణలో ప్ర‌వేశించిన‌ట్లుగా ఇంట‌లిజెన్స్ తేల్చింది. తిర్యాణి అడవుల్లో భాస్కర్ , వర్గీష్ , కొత్తగూడెం అడవుల్లో బండి ప్రకాష్ దళాలు ఉన్న‌ట్లుగా స‌మాచారం. వీరి ఆచూకీకి గ‌త‌ మూడు రోజులుగా గ్రే గౌండ్స్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ నేప‌థ్యంలో స‌మీప జిల్లాల ఎస్పీల‌తో డీజీపీ నేడు స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఆసిఫాబాద్, రామగుండమం, భద్రాద్రి కొత్తగూడెంలో మావోయిస్టు  ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు కుంబి౦గ్ ను విస్తృతం చేశారు.


logo