శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 10:50:42

ప‌ర్వ‌త‌గిరి పోలీసుల‌కు డీజీపీ అభినంద‌న‌

ప‌ర్వ‌త‌గిరి పోలీసుల‌కు డీజీపీ అభినంద‌న‌

హైద‌రాబాద్ : వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలోని పర్వతగిరి సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ కిషన్‌తో స‌హా పోలీసు సిబ్బందిని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి అభినందించారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల వద్ద నిన్న‌ అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడ్డ జీపు ప్రమాదంపై ప‌ర్వ‌త‌గిరి పోలీసులు త‌క్ష‌ణ‌మే స్పందించారు. డ్రైవ‌ర్ మిన‌హా మిగ‌తా వారి ప్రాణాల‌ను కాపాడినందుకు ప‌ర్వ‌త‌గిరి పోలీసుల‌ను డీజీపీ అభినందించారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి ప్ర‌యాణికుల‌ను సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ మృతిచెందగా, ముగ్గురు గల్లంతయ్యారు. పదకొండు మంది సురక్షితంగా బయటపడ్డారు.