బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 01:42:05

వృద్ధులకు సాయంచేసిన పోలీసులకు డీజీపీ అభినందన

వృద్ధులకు సాయంచేసిన పోలీసులకు డీజీపీ అభినందన

గుడ్‌జాబ్‌ ఆఫీసర్స్‌!

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: వరంగల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం బుధరావుపేటకు చెందిన వృద్ధ దంపతులు షేక్‌హుస్సేన్‌, యాకుబ్‌బీలను తమ కుమారుల వద్దకు చేర్చిన పోలీసుల ను డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం అభినందించారు. వృద్ధులైన తల్లిదండ్రులను ఇంటినుంచి గెం టి వేసినట్టు వార్తలు రావడంతోస్పందించిన ఖానాపూర్‌ ఎస్సై సాయిబాబు మంగళవారం గ్రామానికి వెళ్లి కుమారులకు కౌన్సెలింగ్‌ ఇచ్చివారిని ఇంటికి చేర్చారు. స్పందించిన డీజీపీ ‘గుడ్‌జాబ్‌ ఆఫీసర్స్‌..’ అంటూ ట్విట్టర్‌ ద్వారా అభినందించారు. 


logo