మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 01:51:11

అంజయ్య యాప్‌ అదుర్స్‌: డీజీపీ

అంజయ్య యాప్‌ అదుర్స్‌: డీజీపీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ఏకరూప పోలీస్‌ సేవలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన పోలీస్‌ వర్టికల్స్‌ విధానాన్ని సాంకేతికంగా బలోపేతం చేసేలా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ యాప్‌ను రూపొందించిన కానిస్టేబుల్‌ అంజయ్యను డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. వర్టికల్స్‌ విధానంలో రాష్ట్రంలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు తెలుసుకోవడంతోపాటు పనితీరు సమన్వయపర్చేలా యాప్‌ రూపొందించినందుకు అంజయ్యను శుక్రవారం 10వేల క్యాష్‌ రివార్డుతో డీజీపీ సన్మానించారు.