మంగళవారం 26 మే 2020
Telangana - May 01, 2020 , 15:59:58

నిర్మాణ కార్యకలాపాలకు పోలీసులు సహకరించాలి: డీజీపీ

నిర్మాణ  కార్యకలాపాలకు పోలీసులు సహకరించాలి: డీజీపీ

హైదరాబాద్‌: జంట నగరాల్లో నిర్మాణ కార్యకలాపాలను అనుమతించాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి పోలీసులను ఆదేశించారు.  సిమెంట్‌, కాంక్రీట్‌, ఇసుక, స్టీల్‌ తదితర నిర్మాణ సామగ్రితో వెళ్లే లారీలు తదితర వాహనాలను అడ్డుకోవద్దని సూచించారు. నిర్మాణాలు జరిగే ప్రాంతాలకు ఆయా వాహనాలు వెళ్లేలా పోలీసులు సహకరించాలని కోరారు. అన్ని పోలీస్‌ చెక్‌పోస్ట్‌లను  కూడా వెంటనే అప్రమత్తం చేయండి అంటూ సిటీ పోలీసులకు ఒక సందేశాన్ని పంపించారు.  లాక్‌డౌన్‌ మొదలైన మార్చి 24 నుంచి నగరంలో నిర్మాణ కార్యకలాపాలు పూర్తి స్తంభించిపోయిన విషయం తెలిసిందే.  భవన, పారిశ్రామిక నిర్మాణ కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా అనుమతించిన విషయం తెలిసిందే. 


logo