శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 19:52:07

ఆలయాలు మూసివేయట్లేదు.. భక్తులకు మాత్రమే నో ఎంట్రీ

ఆలయాలు మూసివేయట్లేదు.. భక్తులకు మాత్రమే నో ఎంట్రీ

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయడం లేదని టీటీడీ ఈవో ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండటానికి వైద్య ఆరోగ్యశాఖ సూచనల మేరకు జనం గుమికూడే అవకాశం ఉన్నందున భక్తులకు మాత్రం  ఆలయంలోని, కొండపైకి ప్రవేశం కల్పించడం లేదని పేరొన్నారు. దీనిలో భాగంగానే అలిపిరి గేటు, కాలినడక మార్గాలు, అన్ని ఇతర మార్గాలన్నీ మూసివేయడం జరిగిందన్నారు.

 ఈ రోజు రాత్రి వరకు కొండపైన ఉన్న భక్తులకు దర్శన భాగ్యం కల్పించి పంపించి వేయడం జరుగుతుందని, తరువాత ఎవరిని కొండపైకి అనుమతించమని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీవారి దర్శనాలు పూర్తిగా నిలిపివేస్తామన్నారు. శ్రీవారికి జరిగే ఏకాంతసేవలను కైంకర్యాలను అర్చకులు యథావిధిగా జరుపుతారని చెప్పారు. 

టీటీడీతో పాటు విజయవాడ, అన్నవరంలో ప్రసాదానికి బదులు సాంబార్‌ రైస్‌, దద్దోజనం, పులహోర, కట్టెపొంగలి ప్యాకెట్లు భక్తులకు అందిస్తున్నారు. ఈ ఆలయాలకు విదేశీ భక్తులను రానీయడం లేదు. వేములవాడ ఆలయంలో కోడె మొక్కులను రద్దు చేశారు. దాదాపు అన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలను కుదించారు. కొన్ని ఆలయాల్లో పూర్తిగా రద్దు చేశారు. అన్నవరంలో సాధారణ భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. 


logo