మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 15:05:31

వేములవాడ ఆలయానికి పోటెత్తిన భక్తజనం

వేములవాడ ఆలయానికి పోటెత్తిన భక్తజనం

రాజన్న సిరిసిల్ల : వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం కావడంతో భక్తులతో కోలాహలంగా మారింది. వేకువ జాము నుంచే భక్తులు ఆలయంలో స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు. రాజన్నకు ప్రీతి మొక్కైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ఆన్‌లైన్‌లో అభిషేకపూజలు చేశారు. స్వామివారిని దాదాపు 20 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని ఆయల వర్గాలు తెలిపాయి. అలాగే రాజన్న అనుబంధ దేవాలయమైన బద్ధిపోచమ్మ, భీమేశ్వరాలయంలో భక్తులు క్యూ లైన్‌ లలో నిలబడి స్వామి ,అమ్మ వార్లను దర్శించుకున్నారు.