సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 06, 2020 , 13:05:27

కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

జయశంకర్ భూపాలపల్లి : కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో ఆదివారం కావడంతో భక్తుల సందడి నెలకొంది. ముందుగా భక్తులు త్రివేణి సంగమం గోదావరి తీరంలో స్నానాలు చేసి గోదావరి మాతకు ప్రత్యేక దీపాలు వదిలారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొంత మంది భక్తులు గోదావరి తీరం పుష్కారా ఘాట్ పైన పితృ దేవతలకు పిండప్రధాన పూజలు చేసారు.

కొంతమంది భక్తులు ఆలయంలో ఉన్న కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 10 వేలకు పైగా భక్తులు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.logo