బుధవారం 27 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 16:28:21

ధర్మపురి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం

ధర్మపురి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం

జ‌గిత్యాల : హరిహర క్షేత్రం, దక్షిణ కాశీగా భాసిల్లుతున్న ధర్మపురి క్షేత్రంలో సోమవారం కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యతం వైభవంగా జరిగాయి. వివిద ప్రాంతాల నుండి వ‌చ్చిన‌ వేలాది మంది భక్తులు గోదావరి నదిలో కార్తీక స్నానాలు ఆచరించారు. వేకువజామున 4 గంటల నుండే నది స్నానమాచరించి గోదావరిలో దీపాలను  వదిలారు. తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర తదితర రాష్ర్టాల నుండి భక్తులు ధర్మపురికి విచ్చేశారు. ఆలయంలో అభిషేకాది పూజలు, కుంకుమ అర్చనలు, నిత్యకల్యాణం పూజలు ఆచ‌రించి సత్యనారాయణస్వామి వ్రతాలు చేశారు. వేద బ్రాహ్మణులకు దీపదానం చేశారు.logo