మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 23, 2020 , 17:52:32

‘ఖైరతాబాద్‌ గణేశుడి దర్శనానికి భక్తులు రావొద్దు’

‘ఖైరతాబాద్‌ గణేశుడి దర్శనానికి భక్తులు రావొద్దు’

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ నిబంధనల కారణంగా ఖైరతాబాద్‌ గణేశ్‌ను దర్శించుకోవడానికి భక్తులు రావొద్దని ఉత్సవ కమిటీ సూచించింది. ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం వల్ల కరోనా సోకే ప్రమాదం ఉందని కమిటీ హెచ్చరించింది. ఆన్‌లైన్‌లో www.ganapathideva.org  వెబ్‌సైట్‌ ద్వారా గణపతిని దర్శించకుకోవాలని కోరింది. ఖైరతాబాద్‌లో భక్తుల రద్దీ పెరుగడంతో పోలీసులు ఆంక్షలు విధించారు. తెల్లవారుజాము 5 గంటల నుంచి 10:30 వరకు మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అతికొద్ది మందిని మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నట్లు కమిటీ తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo