శనివారం 11 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 16:57:36

భక్తులు మన్యం కొండకు రావొద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

భక్తులు మన్యం కొండకు రావొద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా జూలై 1న తొలి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు మన్యంకొండ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి రాకుండా ఇండ్లలోనే ఉండి పూజలు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ కోరారు. మహబూబ్ నగర్ పోలీస్ లైన్ ఉన్నత పాఠశాలలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో వివిధ వార్డుల్లో రూ. 2.50 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.


 అనంతరం మీడియాతో మాట్లాడారు. జూలై 1న తొలి ఏకాదశి సందర్భంగా మన్యం కొండలో వేలాది మంది గుమికూడేందుకు ఆస్కారం ఉందని, దీనివల్ల కరోనా  వైరస్ వ్యాప్తి చెందుతుందని, అందువల్ల ప్రజలందరూ వారి ఇళ్లలోనే పూజలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలలో పూర్తి జాగ్రత్తలు పాటించాలన్నారు. 


logo