గురువారం 04 జూన్ 2020
Telangana - Jan 26, 2020 , 12:43:27

మేడారానికి పోటెత్తిన భక్తులు

మేడారానికి పోటెత్తిన భక్తులు

ములుగు : ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇవాళ సెలవు దినం కావడంతో భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారం బయల్దేరారు. భక్తులతో మేడారం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి వనదేవతల దర్శనానికి వెళ్తున్నారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక ములుగు సమీపంలోని గట్టమ్మతల్లిని భక్తులు దర్శించుకుంటున్నారు. 

ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలు కానున్న జాతర 8న వన ప్రవేశంతో ముగియనుంది. ఫిబ్రవరి 5న సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఫిబ్రవరి 6న సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది. ఫిబ్రవరి 7న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 8న దేవతల వన ప్రవేశం ఉంటుంది.


logo