అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి : మంత్రి దయాకర్ రావు

హైదరాబాద్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు సూచించారు. ఆదివారం వరంగల్‌లోని అర్అండ్బీ అతిథి గృహంలో గ్రేటర్ వరంగల్ అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉగాది వరకు నగరంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇవ్వాలన్నారు.
పైపులైన్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సిబ్బంది కొరత ఉంటే ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మరమ్మతుల పనులను పూర్తిచేసేందుకు పంచాయతీరాజ్, ఐటీడీఏ శాఖల ఇంజినీర్లు, విశ్రాంత ఇంజినీర్లను డిప్యూటేషన్‌పై నియమించుకోవాలని ఆదేశించారు. నగర అభివృద్ధికి అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.150 కోట్లు మంజూరు చేసిందని, స్థానిక సంస్థల నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.170 కోట్లను ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు.
మున్సిపాలిటీలోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం, పార్కుల నిర్మాణం పనులను సత్వరం పూర్తిచేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండా ప్రకాశ్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరీ రమేశ్, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమేలా సత్పతీ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే రాజీనామా
- త్రిపుర సీఎం నివాసం వద్ద ఉపాధ్యాయుల నిరసన
- అత్యాధునిక ఫీచర్లతో న్యూ జీప్ కంపాస్
- తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం
- యాప్‌లపై నిషేధం డబ్ల్యూటీవో నియమాల ఉల్లంఘనే..
- ట్రక్కును ఢీకొట్టిన అంబులెన్స్.. ఐదుగురు దుర్మరణం
- అమిత్ షా నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష
- పోకో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్...!
- అరెస్ట్ చేయకుండా ఆపలేం.. తాండవ్ మేకర్స్‌కు సుప్రీం షాక్
- కట్టమైసమ్మ చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం