మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 16:52:44

సరికొత్త అందాలను సంతరించుకోనున్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌

సరికొత్త అందాలను సంతరించుకోనున్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిసరాలు త్వరలోనే సరికొత్త అందాలను సంతరించుకోనున్నాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ముందు రూ. 30 కోట్ల వ్యయంతో ఫుట్‌పాత్‌లు, బస్‌ షెల్టర్లు, రోడ్లు తదితర అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన పనులను ఆయా శాఖల అధికారులతో కలిసి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ... వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాలు త్వరలోనే కొత్త అందాలను సంతరించుకోనున్నట్లు తెలిపారు.


logo