గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 22:40:53

అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి : మంత్రి ఎర్రబెల్లి

అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి : మంత్రి ఎర్రబెల్లి

 వ‌రంగ‌ల్ : అభివృద్ధి ప‌నులను వేగంగా పూర్తిచేయాలని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారులను ఆదేశించారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ క‌లెక్ట‌రేట్ సమావేశ మందిరంలో గురువారం ప‌ర్వ‌త‌గిరి, రాయ‌ప‌ర్తి మండ‌లాల్లో డ‌బుల్ బెడ్రూంలు, క‌ల్లాల నిర్మాణం, అభివృద్ధి ప‌నుల‌పై మంత్రి స‌మీక్షించారు. డ‌బుల్ బెడ్రూంలు, ఉపాధి నిధులతో క‌ల్లాల‌ నిర్మాణం నాణ్య‌త‌తో పూర్తి చేయాల‌న్నారు. రోడ్లు, క‌ల్వ‌ర్టులు, కాల్వల మ‌ర‌మ్మ‌తులు చేపట్టాలని సూచించారు. డ‌బుల్ బెడ్రూంల నిర్మాణంలో ఆల‌స్యం చేస్తున్న కాంట్రాక్ట‌ర్ల‌పై మంత్రి మండిప‌డ్డారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్ట‌ర్ల‌ను బ్లాక్ లిస్టులో చేర్చాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పూర్త‌యిన ఇండ్ల‌కు 20-25తేదీల్లో ప్రారంభోత్స‌వం చేయాలని చెప్పారు.

అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు క్షేత్రస్థాయిలో ప‌ర్య‌టించి ప్ర‌జావ‌స‌రాల‌ను గుర్తించాలని సూచించారు. అదేవిధంగా రూర్బ‌న్ ప్రాజెక్టు కింద ప‌ర్వ‌త‌గిరికి మంజూరైన రూ.30 కోట్ల నిధుల‌ను ఏవిధంగా ఖర్చు చేయాలనే అంశంపై వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్తో క‌లిసి మంత్రి చర్చించారు. ప‌ర్వ‌త‌గిరి మండ‌లంలో మాత్ర‌మే ఖ‌ర్చు చేయాల్సిన ఈ నిధుల‌తో 50కి పైగా అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. మ‌ల్టీ జిమ్, మినీ స్టేడియం, ట్యాంకుబండ్ ఆధునీక‌ర‌ణ‌, ప‌ర్వ‌త‌గిరి, క‌ల్లెడ‌లో క్ల‌స్ట‌ర్ క‌మ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. స‌మావేశంలో ప‌ర్వ‌త‌గిరి ఎంపీపీ క‌మ‌ల‌, జడ్పీటీసీ సింగ్ లాల్, పీఏసీఎస్ చైర్మ‌న్ మ‌నోజ్, ఎంపీడీఓ సంతోశ్, ఎమ్మార్వో మ‌హ్మ‌ద్ పాషా, రాయ‌ప‌ర్తి ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రైతు స‌మ‌న్వ‌య స‌మితి క‌న్వీన‌ర్ సురేంద‌ర్, బిల్లా సుధీర్ రెడ్డి, న‌ర్సింహానాయ‌క్ త‌దిత‌రుల‌తోపాటు డీఆర్డీఏ పీడీ సంప‌త్, పంచాయ‌తీరాజ్ ఈఈ సంప‌త్, ఇరిగేష‌న్ శాఖ ఈఈ శ్రావ‌ణ్, జిల్లా వ్య‌వ‌సాయ‌శాఖ అధికారి ఉష‌, ఆర్డీఓ మ‌హేంద‌ర్, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.


logo