అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీతో జరుగదు : మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి : అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీతో సాధ్యం కాదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంచంద్రాపూర్ 112వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి పుష్పా నగేశ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నామని, రాష్ట్రం వచ్చినంకనే మంచి పనులు జరుగుతున్నాయన్నారు. రామచంద్రాపురంలో రూ.120 కోట్లతో ఇంటింటికీ మంచినీరు అందుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమలవుతున్నాయని, అవి కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఉన్నాయా? అన్నారు. కాలుపెట్టే పరిస్థితి లేని రాయసముద్రం చెరువును అభివృద్ధి చేశామని, త్వరలోనే చెరువును అందమైన పార్క్‌గా తీర్చిదిద్దుతామన్నారు.
ఢిల్లీ నుంచి డైరెక్ట్‌గా లోకల్ బాడీస్‌కు నిధులు తేవడం సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారని, మన ప్రాంత అభివృద్ధికి నిధులు కేవలం కేసీఆర్ ఒక్కరే ఇస్తారన్నారు. 40వేల డబుల్ బెడ్రూం ఇండ్లు పటాన్‌చెరువులో కట్టామని, ఇందులో నాలుగువేల ఇండ్లు రామచంద్రాపూర్ డివిజన్‌కు కేటాయించనున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు జరుగలేదని, నిరుపేదలకు తప్పనిసరిగా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని జిల్లామంత్రిగా హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు కావాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాలని, కరోనా మహమ్మారి సమయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎవరైనా వచ్చారా? అని ఓటర్లను ప్రశ్నించారు. ఆపత్కాలంలోని రాని పార్టీ నేతలకు ఎట్ల ఓట్లు వేస్తరని, వరద సాయం అడ్డుకున్నది బీజేపీ, కాంగ్రెస్ నేతలనేనన్నారు. డిసెంబర్ 5వ తేదీ తర్వాత మిగతా వరద బాధితులకు సహాయం అందజేస్తామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
- రిలయన్స్ 22-26 మధ్య డిజిటల్ ఇండియా సేల్.. డిస్కౌంట్లు.. ఆఫర్లు
- ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్లు లేవు..కారణమేంటో ?
- మహేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!
- ఏనుగు మరణం.. వెక్కివెక్కి ఏడ్చిన అటవీ రేంజర్
- సీతారామ ప్రాజెక్టు పనుల వేగవంతానికి సీఎం కేసీఆర్ ఆదేశం
- వచ్చీరాగానే వడివడిగా..
- సువేందుకు అభిషేక్ లీగల్ నోటీసు.. ఎందుకంటే?!
- కబడ్డీ ఆటలో.. యువకుడు మృతి
- ట్రంప్ వీడ్కోలు.. నెటిజెన్ల వెక్కిరింతలు
- కృష్ణంరాజును ప్రభాస్ ఎలా రెడీ చేస్తున్నాడో చూడండి..వీడియో