గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 02:13:37

సీఎం కేసీఆర్‌ హయాంలోనే ఆలయాల అభివృద్ధి: రమణాచారి

సీఎం కేసీఆర్‌ హయాంలోనే  ఆలయాల అభివృద్ధి: రమణాచారి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అర్చకోద్యోగుల పదవీ విరమణ వయ స్సును 58 నుంచి 65 ఏండ్లకు పెంచా లని, రిటైర్మెంట్‌ అయిన అర్చకులకు వెల్ఫేర్‌బోర్డు ద్వారా రూ. 10 లక్షల గ్రాంటు ఇప్పించాలని అర్చక సంఘాల ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని కాచిగూడలో అర్చక, ఉద్యోగ ఐక్యకార్యాచరణ సమితి ఆవిర్భావసభ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ చైర్మన్‌ కేవీ రమణాచారి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆలయాల అభివృద్ధి, అర్చకుల సంక్షేమంపై ప్రధానంగా దృష్టి సారించారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోని దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా వేతనాలు అందించేందుకు ఏటా రూ.115కోట్లు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. 

ధూపదీప నైవేద్యం కింద పనిచేస్తున్న అర్చకుల వేతనాలను రూ. 10 వేలకు పెంచాలని దేవాదాయశాఖ మంత్రితో చర్చిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో అర్చకోద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కనకంభట్ల వెంకటేశ్వరశర్మ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉపేంద్రశర్మ, ధూప దీప నైవేద్య అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వీటూరి ఆంజనేయాచారి, రాష్ట్ర నాయకులు దౌలతాబాద్‌ వాసుదేవశర్మ, తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తనుగుల రత్నాకర్‌, అర్చక సంఘాల ప్రతినిధులు రవీంద్రాచారి, కాండూరి కృష్ణమాచార్యులు, గట్ట శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.  logo