బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 17:05:36

టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అభివృద్ధి : మంత్రి కొప్పుల

టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అభివృద్ధి : మంత్రి కొప్పుల

జగిత్యాల : టీఆర్‌స్‌ పాలనలోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి జరిగిందని సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. గురువారం పెగడిపల్లి మండలం ఎల్లాపూర్, కీచులాటలపల్లి, రాజారామ్‌ పల్లి గ్రామాల్లో రూ. కోటి 12 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.  అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా హరితహారంలో భాగంగా మొక్కలు నాటి మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో 60 ఏండ్లలో జరగని అభివృద్ధి ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కేవలం కేవలం 6 ఏండ్లలో చేసి చూపారని అన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుంచుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి స్థానికులు చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్‌రావు, ఎంపీపీ గోలి శోభాసురేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ గంగాధర్, సింగిల్ విండో చైర్మన్లు మంత్రి వేణుగోపాల్, కర్ర భాస్కర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ ఛైర్మన్ తిరుపతి నాయక్, వైస్ ఛైర్మన్ రమణ, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo