సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 16:34:54

టీఆర్‌ఎస్‌ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం

టీఆర్‌ఎస్‌ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ గెలుపుతోనే ఆర్కేపురం అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురం డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు మైనార్టీ, క్రిస్టియన్లు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆమె వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని గెలపించుకుంటే డివిజన్‌లో అభివృద్ధి జరుగుతుందన్నారు.

సీఎం కేసీఆర్‌ రూ.65వేల కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా ప్రతి పక్షాల అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధి పూర్తిగా కుంటుబడుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు టీఆర్‌ఎస్‌ వైపే చూస్తున్నారని తెలిపారు.