శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 16:23:03

పార్టీలకు అతీతంగా అభివృద్ధి : ఎమ్మెల్యే శానంపూడి

పార్టీలకు అతీతంగా అభివృద్ధి : ఎమ్మెల్యే శానంపూడి

సూర్యాపేట : పార్టీల‌కు అతీతంగా అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్న‌ట్లు హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌న‌గ‌ర్ మండ‌లం లింగగిరి గ్రామంలో చేప‌ట్టిన బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే పాల్గొని మ‌హిళ‌ల‌కు చీర‌ల‌ను అంద‌జేశారు. అనంతరం లింగగిరి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి  చెందిన స్థానిక‌ నాయకులు, కార్య‌క‌ర్త‌లు సుమారు 100 మంది గులాబీ గూటికి రాగా ఎమ్మెల్యే వీరంద‌రికి పార్టీ కండువాలు క‌ప్పి సాధ‌రంగా ఆహ్వానించారు. టీ‌ఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వీరంతా పార్టీలో చేరిన‌ట్లు సైదిరెడ్డి ఈ సంద‌ర్భంగా తెలిపారు. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న పశు వైద్య‌శాల‌ను ప‌రిశీలించారు. నర్సరీని సంద‌ర్శించారు. పశు వైద్య‌శాల నూతన భవన నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఈ సంద‌ర్భంగా హామీ ఇచ్చారు. అదేవిధంగా లింగగిరి బ్రిడ్జి నిర్మాణం డిసెంబ‌ర్‌లోగా పూర్తి అవుతుంద‌ని తెలిపారు.
logo