ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 27, 2020 , 20:01:51

అభివృద్ధి, సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ఎజెండా : ఎమ్మెల్సీ కవిత

అభివృద్ధి, సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ఎజెండా : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ : రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజాసంక్షేమమే టీఆర్‌ఎస్‌ ఎజెండా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీజేపీ‌ నాయకులకు మత రాజకీయాలు తప్ప అభివృద్ధి పట్టదని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గాంధీనగర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్‌ అభ్యర్థి ముఠా పద్మతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఆరేండ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్‌ అద్భుత ప్రగతి సాధించిందని గుర్తుచేశారు.

వరదలతో హైదరాబాద్‌ ప్రజలు సర్వం కోల్పోయి అల్లాడినా కేంద్రం నయాపైసా సాయం అందించలేదని, ఎన్నికల వేళ ఇప్పుడొచ్చి అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఓట్లు.. సీట్ల కోసం బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. నిరంతరం ప్రజల పక్షాన నిలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు. పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. గాంధీనగర్ డివిజన్లో గత ఆరేండ్లుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ‌నిర్వహించామని, పార్టీ అభ్యర్థి ముఠా పద్మాగోపాల్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.