బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 15:53:11

అభివృద్ధి, సంక్షేమానికి పేద్దపీట

అభివృద్ధి, సంక్షేమానికి పేద్దపీట

మెదక్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమానికి సముచిత స్థానం కల్పిస్తున్నారని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రామాయంపేటలోని ఎంపీపీ అతిథి గృహంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ఎస్సీ కార్పొరేషన్‌ కింద మంజూరైన చెక్కులను అంద జేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కల్యాణలక్ష్మి పథకం దేశానికే ఆదర్శమన్నారు. దేశంలో ఎవరు చేయని విధంగా రైతుల కోసం సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. బీసీలకు కూడా త్వరలోనే అర్హులైన వారందరికీ సబ్సీడీ రుణాలను అందజేస్తామన్నారు. 


logo