గురువారం 16 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 14:49:36

ఉపాధి పనుల్లో పేలిన డిటోనేటర్లు

ఉపాధి పనుల్లో పేలిన డిటోనేటర్లు

కరీంనగర్‌ : జిల్లాలోని గన్నేరువరం మండలం చాకలివానిపల్లిలో ఉపాధి పనుల్లో ప్రమాదం తప్పింది. కూలీలు ఉపాధిహామీ పనులకు వెళ్లారు. పనులు చేస్తున్న క్రమంలో ఓ చెత్తకుప్పకు నిప్పుపెట్టారు. మంటలు అంటుకుని పదుల సంఖ్యలో డిటోనేటర్లు పేలాయి. కూలీలు మంటకు దూరంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. గుర్తుతెలియని వ్యక్తులు పేలుడు పదార్థాలను గోనెసంచుల్లో ఉంచి చెట్టుకింద చెత్తకుప్పలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనాస్థలిలో 150కి పైగా డిటోనేటర్లు, జిలెటిన్‌స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.


logo