గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 11, 2020 , 13:00:31

హరితహారం మొక్కల ధ్వంసం..వ్యక్తికి రూ.10 వేల జరిమానా

హరితహారం మొక్కల ధ్వంసం..వ్యక్తికి రూ.10 వేల జరిమానా

వరంగల్ రూరల్ : హరితహారంలో నాటిన మొక్కలను ధ్వంసం చేసిన వ్యక్తికి జరిమానా విధించిన ఘటన జిల్లాలోని రాయపర్తి మండలం గన్నారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్ద హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను అనగాని ఎల్లయ్య అనే వ్యక్తి ధ్వసం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానిక గ్రామపంచాయతీ సిబ్బంది ఎల్లయ్యకు రూ.10 వేల జరినామా విధించారు.

రాష్ట్రాన్ని హరితవనంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపట్టింది. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఎవరైనా ఈ మొక్కలను ధ్వసం చేస్తే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.logo