సోమవారం 25 మే 2020
Telangana - Apr 08, 2020 , 00:58:10

రూ.50కే ముఖానికి రక్షణ కవచం

రూ.50కే ముఖానికి రక్షణ కవచం

  • ఎల్వీప్రసాద్‌ కంటి వైద్య విజ్ఞాన సంస్థ
  • సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ బృందం రూపకల్పన

హైదరాబాద్‌ సిటీబ్యూరో/బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 బారిన పడకుండా ఉండేందుకు ఎల్వీప్రసాద్‌ కంటి వైద్య విజ్ఞాన సంస్థ సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ బృందం పూర్తి ముఖరక్షణ కవచాన్ని తక్కువ ధరలో రూపొందించింది. నలుగురు సభ్యుల బృందం ఓపెన్‌సోర్స్‌ వైజర్‌ (ఓఎస్‌ వైజర్‌) పేరిట రెండ్రోజుల్లో కవచాన్ని డిజైన్‌ చేసినట్టు ప్రాజెక్టు అధిపతి పెంపటి సందీప్‌ తెలిపారు. ఎన్‌-95 మాస్కు ఉన్నా.. పూర్తి రక్షణలేక ఆందోళన చెందేవారిని దృష్టిలో ఉంచుకొని కవచాన్ని రూపొందించామని, రూ.50లకే అందిస్తున్నామని పేర్కొన్నారు. 

ఎల్వీ ప్రసాద్‌ కంటి దవాఖాన 250, ఫెర్నాండెజ్‌ దవాఖానకు 600, యూపీ (జాన్సీ)లోని మిలిటరీ సిబ్బందికి 150 ముఖ కవచాలను సరఫరాచేసినట్టు తెలిపారు. హైదరాబాద్‌, విశాఖ, బెంగళూరు, ముంబై, గుజరాత్‌, యూపీలలో వీటికోసం విక్రేతదారులను గుర్తించినట్టు పేర్కొన్నారు. ముఖానికి రక్షణ కవచం ధరించడం ద్వారా కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొవచ్చని, పనులను సవ్యంగా చేసుకోవచ్చని చెప్పారు.   పూర్తివివరాలకు OSVisorWebpage/Video tutorial:https:// lvpmitra. com/ osvisorలో కానీ, 8096719434 ల లో సంప్రదించవచ్చని అన్నారు. 


logo