గురువారం 09 జూలై 2020
Telangana - Apr 01, 2020 , 01:14:29

చేయూతనిచ్చి.. కడుపు నింపి..

చేయూతనిచ్చి.. కడుపు నింపి..

 ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ జూబ్లీహిల్స్‌లోని తన క్యాంప్‌ కార్యాలయంలో  జీహెచ్‌ఎంసీ సిబ్బంది, విధుల్లో ఉన్న పోలీసులు, పేదలకు రెండు పూటలా ఆహారం అందేలా చర్యలు తీసుకున్నారు. యూసుఫ్‌గూడలో కరోనా వైరస్‌ నియంత్రణపై స్థానికులకు అవగాహన కల్పించారు. బల్దియా సిబ్బందితో కలిసి రసాయన మిశ్రమాన్ని స్ప్రే చేశారు.

  • బోరబండ డివిజన్‌లోని బస్తీల్లో డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ బల్దియా సిబ్బందితో కలిసి  పర్యటించారు. పారిశుధ్య పనులు దగ్గరుండి పరిశీలించారు.
  • మూడుచింతలపల్లి మండలం కేశవరం, కొల్తూర్‌ గ్రామాల్లో  సర్పంచ్‌లు జ్యోతి బలరాంగౌడ్‌, శిల్పా యాదగిరితో కలిసి ఎంపీపీ వనందాస్‌ హారిక, ఎంపీడీ సువిధ 1200 మంది వలస కూలీలను గుర్తించారు. వారికి 12 కిలోల బియ్యం, రూ.500 నగదు అందజేస్తామన్నారు. 
  • లాక్‌ డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా అనవసరంగా రహదారులపైకి వస్తున్న వారికి కేపేపీహెచ్‌బీ పోలీసులు అస్తిపంజరం వేషధారణతో ఠాణా ఎదుట అవగాహన కల్పించారు. ఇండ్లకే పరిమితమై కరోనా కట్టడికి తోడ్పడాలన్నారు.
  • బాలాజీనగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నేత గోనే శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులను మాస్క్‌లు పంపిణీ చేశారు. 
  • ఆల్విన్‌ కాలనీలో కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేశ్‌ గౌడ్‌ పారిశుధ్య పనులు చేపట్టారు. 
  • గాజులరామారం సర్కిల్‌, చంద్రగిరినగర్‌లో వైద్య, ఆరోగ్యశాఖల అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించారు.
  • వేమనకాలనీ వీకర్‌సెక్షన్‌బస్తీలో ప్రమాదవశాత్తు మరణించిన  శంకర్‌ దహన సంస్కారాలకు   అతనికి కుటుంబానికి కార్పొరేటర్‌ బొబ్బ నవతారెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. 


logo