శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 06:33:52

అక్రమంగా నిర్మించిన భవనాలు కూల్చివేత..

అక్రమంగా నిర్మించిన భవనాలు కూల్చివేత..

జీడిమెట్ల: గాజులరామారం సర్కిల్‌ జగద్గిరిగుట్ట డివిజన్‌ పరిధిలో సోమయ్యనగర్‌లో అనుమతి లేకుండా నిర్మించిన ఓ బహుళ అంతస్థు భవనాన్ని బుధవారం గాజులరామారం సర్కిల్‌ పట్టణ విభాగం అధికారులు కూల్చివేశారు. ఏసీపీ గణేశ్‌కు అందిన ఫిర్యాదు మేరకు సుపర్‌వైజర్‌ సంగీతబాయితోపాటు సిబ్బందితో కలిసి భవనాన్ని కూల్చివేశారు. బాధితుడు సత్తిరెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇంటి నిర్మాణాన్ని టౌన్‌ ప్లానింగ్‌ అధికారు లు కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఏసీపీ గణేశ్‌ను వివరణ కోరగా.. ఇంటి జయమానికి తమ సిబ్బంది నోటీసులు అందజేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

కార్మికనగర్‌, వైఎస్‌ఆర్‌నగర్‌లో ..

జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కార్మికనగర్‌, వైఎస్‌ఆర్‌నగర్‌లోని ప్రభుత్వభూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను బుధవారం కాప్రా తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ ఆదేశాలమేరకు రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సర్వేనంబర్‌ 209, 205లో అక్రమంగా నిర్మించిన 12 రూమ్‌లు, 13బేస్మెంట్లు, 2 కాంపౌండ్‌ వాల్‌ను కూల్చివేసినట్లు ఆర్‌ఐ రమేశ్‌ తెలిపారు. ప్రభుత్వభూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని హెచ్చరించా రు. కార్యక్రమంలో వీఆర్‌వో విజయ్‌కుమార్‌, గంగాధర్‌, పాండు పాల్గొన్నారు.


logo