బుధవారం 03 జూన్ 2020
Telangana - May 14, 2020 , 19:26:19

పేదలకు సరుకుల పంపిణీ అభినందనీయం : మంత్రి కొప్పుల

పేదలకు సరుకుల పంపిణీ అభినందనీయం : మంత్రి కొప్పుల

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వస్తున్నారు. నిత్యావసరాలు అందిస్తూ, అన్నదానాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. కాగా, మియాపూర్‌ లోని కల్వరి టెంపుల్‌ పాస్టర్ డాక్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిరుపేదలకు కుల,మతం, ప్రాంతీయ  భేదం లేకుండా ఆకలిని తీర్చే ఉద్దేశంతో సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఇప్పటి వరకు దాదాపు (600 టన్నులు సరుకులు) 30 వేల కుటుంబాలకు నెల రోజులు సరిపడా నిత్యావసర సరుకుల కిట్  లను పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా మంత్రి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కల్వరి టెంపుల్‌ ను   సందర్శించారు. వారు చేస్తున్న నిత్యావసర సరుకుల ప్యాకింక్, సరుకుల నాణ్యత ను పరిశీలించి మాట్లాడారు. వారు చేస్తున్న సేవలు బాగున్నాయని కొనియాడారు.  ఇలాంటి క్లిష్ట సందర్భాల్లో మానవత్వంతో స్పందించి, ఆదుకునే వారే నిజమైన సేవకులన్నారు.


logo