బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 02:17:44

స్వచ్ఛతతో సీజనల్‌ వ్యాధులు దూరం

స్వచ్ఛతతో సీజనల్‌ వ్యాధులు దూరం

  • పల్లె, పట్టణ ప్రగతి విజయవంతం
  • మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌
  • నమస్తే తెలంగాణ క్లిప్పింగులతో ట్వీట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమాలతో రాష్ట్రంలో ఈ ఏడాది సీజన్‌ వ్యాధులు తగ్గాయని మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల క్రియాశీల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పరిశుభ్రత నిర్వహణ లక్ష్యంగా ప్రభుత్వం చేసిన కృషి నెరవేరిందని.. సీజనల్‌ వ్యాధులు తగ్గడమే ఇందుకు నిదర్శమని తెలిపారు. పట్టణ ప్రగతి, పల్లెప్రగతి విజయవంతంపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనాలను మంత్రి కేటీఆర్‌ శనివారం ట్విటర్‌లో పోస్టుచేశారు.logo