గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 12, 2020 , 19:11:00

అర్బ‌న్ ఫారెస్ట్ పార్కుల‌తో పట్టణవాసులకు ఆహ్లాదం : మంత్రి అల్లోల‌

అర్బ‌న్ ఫారెస్ట్ పార్కుల‌తో పట్టణవాసులకు ఆహ్లాదం : మంత్రి అల్లోల‌

మంచిర్యాల : నగర, పట్టణ వాసులకు మానసికోల్లాసంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు అడవులకు దగ్గరగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో అర్బన్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర అటవీ,  ప‌ర్యావ‌ర‌ణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శ‌నివారం చెన్నూర్ ప‌ట్ట‌ణ స‌మీపంలో జోడువాగుల వ‌ద్ద ఏర్పాటు చేస్తున్న అంబేడ్క‌ర్ అర్బ‌న్ ఫారెస్ట్ పార్కు అభివృద్ది ప‌నుల‌ను ప్ర‌భుత్వ విప్ బాల్క సుమన్‌తో క‌లిసి మంత్రి ప‌రిశీలించారు.  అటవీ ప్రాంతంలో కలియ తిరుగుతూ అర్భన్ పార్కు మోడల్, ఏర్పాట్లపై ఆరా తీశారు. 450 ఎకరాల్లో అర్బ‌న్ ఫారెస్ట్ పార్కును సుంద‌రంగా తీర్చిదిద్దుతున్న‌ట్లు అధికారులు మంత్రికి వివ‌రించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ... అడ‌‌‌‌వుల సంర‌‌‌‌క్షణ‌‌‌‌, అభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత‌ను ఇస్తున్నారన్నారు. ప‌‌‌‌ర్యావ‌‌‌‌ర‌‌‌‌ణ పరిరక్షణతో పాటు ప్రజ‌‌‌‌ల‌‌‌‌కు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కుల‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. ప్రతీ పార్కులో  ఎంట్రీ గేట్, వాకింగ్ పాత్, వ్యూ పాయింట్, పిల్లల ఆట స్థలం, యోగా షెడ్, సైక్లింగ్, వనదర్శిని కేంద్రం,  అటవీ ప్రాంతం అంతా రక్షణ గోడ (చైన్ లింక్ ఫెన్సింగ్, సీ త్రూ వాల్, కందకాలు), ఇత‌ర‌ సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. ప్రతీ పార్కుకు సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చు అవుతోందన్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో చెన్నూర్ ఎఫ్‌డీవో రాజారావు, త‌దిత‌రులు పాల్గొన్నారు. అంత‌కుముందు  హ‌రితహారం కార్య‌క్ర‌మంలో భాగంగా మంత్రి, ప్ర‌భుత్వ విప్ అర్బ‌న్ ఫారెస్ట్ పార్కులో మొక్క‌లు నాటారు.


logo