సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 13:15:36

నిజాముద్దీన్‌ రైలులో కరోనా అనుమానిత జంట

నిజాముద్దీన్‌ రైలులో కరోనా అనుమానిత జంట

వరంగల్‌ : నిజాముద్దీన్‌ రైలులో ప్రయాణిస్తున్న కరోనా అనుమానిత జంటను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న ఢిల్లీకి చెందిన దంపతులు బెంగళూరు-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు రైలును కాజీపేటలో నిలిపివేశారు. దంపతులను వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. రైలులోని మరో అనుమానిత వ్యక్తిని సైతం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. దీంతో ప్రయాణికులు, రైల్వే ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


logo