శనివారం 30 మే 2020
Telangana - May 15, 2020 , 06:45:26

జూన్‌ 20లోగా డిగ్రీ ప్రాక్టికల్‌, థియరీ పరీక్షలు

జూన్‌ 20లోగా డిగ్రీ ప్రాక్టికల్‌, థియరీ పరీక్షలు

నల్లగొండ  : ఎంజీయూ పరిధి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిలిచిపోయిన డిగ్రీ సెమిస్టర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలని ఎంజీయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.యాదగిరి సూచించారు. డిగ్రీ పరీక్షల నిర్వహణపై డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్‌ 10 నుంచి 20 లోగా ప్రాక్టికల్స్‌, థియరీ పరీక్షలు ప్రారంభంకానున్నట్లు తెలిపారు. 2, 4, 6వ సెమిస్టర్స్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌, 1, 3వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష ఫీజులను జూన్‌ 1 నుంచి వారంలోగా చెల్లించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీఓఈ రమేశ్‌కుమార్‌, అడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ అల్వాల రవి పాల్గొన్నారు.logo