బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 06, 2020 , 07:39:57

రేపటినుంచి డిగ్రీ ఫస్టి‌యర్‌ క్లాసులు

రేపటినుంచి డిగ్రీ ఫస్టి‌యర్‌ క్లాసులు

హైద‌రా‌బాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలే‌జీల్లో రేపటి నుంచి ఫస్టి‌యర్‌ తర‌గ‌తులు ప్రారంభంకానున్నాయి. ఈమేరకు కాలేజీలు సిద్ధంగా ఉండాలని దోస్త్‌ కన్వీ‌నర్‌ ప్రొఫె‌సర్‌ లింబాద్రి తెలి‌పారు. పూర్తిస్థాయి విద్యాక్యాలెం‌డర్‌ త్వర‌లోనే విడు‌దల చేస్తా‌మని వెల్లడించా. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదే‌శాలు వచ్చాకే రెగ్యు‌లర్‌ తర‌గ‌తులు ప్రారం‌భి‌స్తా‌మని పేర్కొన్నారు. దోస్త్‌ స్పెషల్‌ డ్రైవ్‌ కౌన్సె‌లిం‌గ్‌లో 28,136 మంది విద్యా‌ర్థులు పాల్గొ‌న్నారని, అందులో 27,365 మందికి సీట్లు వచ్చా‌యని వెల్లడించారు. కౌన్సె‌లింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు కాలే‌జీల్లో సెల్ఫ్‌ రిపో‌ర్టింగ్‌, ఫిజి‌కల్‌ రిపో‌ర్టింగ్‌ చేయడానికి ఈ నెల 8 వరకు గడువు విధిం‌చా‌మని తెలిపారు. గడువు తర్వాత కాలే‌జీ‌ల్లో రిపోర్టు చేసేవారికి అడ్మి‌ష‌న్లకు అను‌మతి ఉండ‌దని చెప్పారు.


logo