సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 08:23:05

డిసెంబ‌ర్ 1 నుంచి డిగ్రీ, బీటెక్ ఫ‌స్టియ‌ర్ క్లాసులు

డిసెంబ‌ర్ 1 నుంచి డిగ్రీ, బీటెక్ ఫ‌స్టియ‌ర్ క్లాసులు

హైద‌రా‌బాద్: డిగ్రీ, బీటెక్‌ ఫస్టి‌య‌ర్‌కు సంబం‌ధించి 2020–21 విద్యా‌సం‌వ‌త్సరం క్లాసు‌లను డిసెం‌బర్‌ 1 నుంచి ప్రారం‌భించే అవ‌కాశం ఉన్నది. ఇందుకోసం వ‌ర్సి‌టీలు ప్రణా‌ళి‌కలు సిద్ధం చేస్తు‌న్నాయి. క్లాసులు ఆన్‌‌లై‌న్‌‌లోనా? రెగ్యు‌లర్‌గా నిర్వ‌హిం‌చాలా? అన్న‌దా‌నిపై స్పష్టత రావాల్సి ఉన్నది. రెగ్యు‌లర్‌ క్లాసులు ప్రారం‌భిం‌చా‌లంటే హాస్టళ్లు తెర‌వాలి. ఇప్పు‌డున్న పరి‌స్థి‌తుల్లో ఆ అవ‌కాశం లేదు. దీంతో ఆన్‌‌లైన్‌లో క్లాసులు నిర్వ‌హించి, సిల‌బస్‌ తగ్గిం‌చా‌లని ఓయూ సీని‌యర్‌ ప్రొఫె‌సర్‌ ఒకరు తెలి‌పారు.

డిగ్రీలో 30శాతం సిల‌బస్‌ తగ్గింపు!

రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టు‌కొని డిగ్రీ సెమి‌స్టర్‌ పరీ‌క్షల్లో 30 శాతం సిల‌బస్‌ తగ్గిం‌చా‌లని ఉన్నత విద్యా‌మం‌డలి యోచి‌స్తు‌న్నది. కాలేజీ పని‌రో‌జు‌లను 180 నుంచి 150 వరకు తగ్గించే అవ‌కా‌శాలు ఉన్నాయి. వీటి‌తో‌పాటు పలు అంశా‌లపై ఉన్నత విద్యా‌శాఖ అధి‌కా‌రులు, సబ్జెక్టు నిపు‌ణు‌లతో కమిటీ వేయ‌ను‌న్నట్టు ఉన్నత విద్యా‌మం‌డలి చైర్మన్‌ పాపి‌రెడ్డి తెలి‌పారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సు‌ల‌తో‌పాటు బీటెక్‌, బీఫా‌ర్మసీ, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంటెక్‌, ఎంఫా‌ర్మసీ పరీ‌క్షల్లో కూడా సిల‌బస్‌ తగ్గించే అవ‌కా‌శాలు ఉన్నాయి.