బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 15, 2020 , 17:11:03

శ్రీశైలం ప్రధాన రహదారిపై కూలిన రక్షణ గోడ

శ్రీశైలం ప్రధాన రహదారిపై కూలిన రక్షణ గోడ

నాగర్‌కర్నూల్‌ : కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రధాన రహదారి రక్షణ గోడ శనివారం కూలింది. అమ్రాబాద్‌ మండలం మన్ననూరు సమీపంలోని దర్గా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఘాట్‌ రోడ్డు రక్షణ గోడ కూలడంతో రహదారి ప్రమాదకరంగా మారింది. దీంతో సమాచారం అందుకున్న అమ్రాబాద్‌ పోలీసులు శ్రీశైలం మార్గంలో వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. వర్షాలకు రక్షణ గోడ కూలినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాన నీటికి కోతకు గురై గోడ కూలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా.. శ్రీశైలం భ్రమరాంభికా మల్లికార్జున స్వామి ఆలయంలో కరోనా కలకలం సృష్టించగా, భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. శనివారం నుంచి దర్శనాలకు అవకాశం కల్పిస్తున్నారు. అలాగే ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వస్తున్నది. దీంతో అటు ఆలయానికి వెళ్లేందుకు, ఇటు ప్రాజెక్టును చూసేందుకు జనం వస్తున్న క్రమంలో ఘాట్‌ రోడ్డు రక్షణ గోడ కూలడంతో ఆందోళన నెలకొంది.

తాజావార్తలు


logo