రైల్వేలో రక్షణకే ప్రాధాన్యం : డీఆర్ఎం ఏకే గుప్తా

కొత్తగూడెం టౌన్ : రైల్వేలో ప్రయాణికుల, కార్మికుల రక్షణకే ప్రాధాన్యత ఇస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ (డీఆర్ఎం) అభయ్ కుమార్ గుప్తా అన్నారు. గురువారం భద్రాచలం రోడ్డు కొత్తగూడెం రైల్వే స్టేషన్(బిడిసిఆర్) ఏరియాలో ఆయన పర్యటించారు. ప్రత్యేక రైలులో కొత్తగూడెం చేరుకున్న ఆయన వెంటనే రైల్వే కాలనీ, దవాఖాన, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, కార్మికుల గృహాలను పరిశీలించారు. వారికి అందుతున్న మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డీఆర్ఎం దృష్టికి పలువురు వారి సమస్యలను విన్నవించారు. కాలనీలో పారిశుధ్యం సక్రమంగా లేదని, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా నిరంతరం తాగునీటి సమస్య ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో పేరుకుపోయిన చెత్త విషయంలో సంబంధి అధికారు లపై డీఆర్ఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ప్రయాణికుల పుట్ ఓవర్ బ్రిడ్జి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.
కొవిడ్-19 కారణంగా కేంద్ర ప్రభుత్వం రైళ్ల రాకపోకలను నిలిపి వేసిందన్నారు. ప్రత్యేక రైళ్ల కేటాయింపులు లేవని, ప్రస్తుతం ఉన్న రైళ్లను కుదించే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా రైల్వే యస్.సి.ఆర్.ఎం.యు. కార్మిక సంఘం నాయకులు డీఆర్ఎంకు సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు.
డీఆరేంతో పాటు సీనియర్ డీఓఎమ్. ఎన్. మనోజ్, సీనియర్ డీఎస్టీఈ. సి. వి.ఆర్. రాజు, సీనియర్ డీసీఎం బసవేశ్వరరాజ్, సీనియర్ డీఈఈ టీఆర్ఎస్ఓ మధుసూదన్, సీనియర్ డీఈ ఎన్ కోఆర్డినేషన్ బి. కృష్ణారెడ్డి, స్థానిక ఏవో కిరణ్‌కుమార్, కమర్షియల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస బాబు, స్టేషన్ సూపరింటెండెంట్ ఆర్కే మీనా, ప్రసాద్,యూనియన్ నాయకులు ఖాజాబాబా, రవి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఉద్యోగ నియామకాల కోసం గిరిజన యువతకు శిక్షణ
బుధేరాలో నాటు కోళ్లు మృతి..ఆందోళనలో గ్రామస్తులు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
రైతు వేదికలు దేశానికే ఆదర్శం : మంత్రి మల్లారెడ్డి
తాజావార్తలు
- వర్క్ ఫ్రం హోం: అతివలకే కార్పొరేట్ల ఓటు!
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్‌కు ఎఫ్‌టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
- శ్రీశైలంలో కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్
- కేంద్ర సాయుధ పోలీసు దళాలకు ప్రత్యేక ఆరోగ్య పథకం
- ఏ వ్యాక్సిన్ ఎంత వరకూ ఇమ్యూనిటీ ఇస్తుంది..?
- తమిళ సంస్కృతి ప్రధాని మోదీకి తెలియదు: రాహుల్