సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:30:34

సరిహద్దు రక్షణకు డీఆర్డీవో మరో ఆవిష్కరణ

సరిహద్దు రక్షణకు డీఆర్డీవో మరో ఆవిష్కరణ

  • ‘పీ7 హెవీ డ్రాప్‌ సిస్టమ్‌' రూపకల్పన 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సరిహద్దు రక్షణను బలోపేతంచేసే దిశగా హైదరాబాద్‌కు చెందిన ‘రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ’ (డీఆర్డీవో) మరో కీలక సాంకేతికతను ఆవిష్కరించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సుమారు ఏడు టన్నుల వరకు బరువున్న వాహనాలను విమానాల ద్వారా తరలించగలిగే ‘పీ7 హెవీ డ్రాప్‌ సిస్టం’ను రూపొందించింది. ఐఎల్‌-76 విమానాల్లో ఈ వ్యవస్థను ఉపయోగించవచ్చు. మేకిన్‌ ఇండియాలో భాగంగా దీనిని అభివృద్ధి చేసినట్టు డీఆర్డీవోవర్గాలు తెలిపాయి. ఆర్మీ, వైమానిక దళం, డీఆర్డీవోకు చెందిన ఏరియల్‌ డెలివరీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఏడీఆర్డీఈ) ప్రతినిధులు బుధవారం ఆగ్రాలో ఈ వ్యవస్థకు ట్రయల్స్‌ నిర్వహించారు. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో 600 మీటర్ల ఎత్తులో వెళ్తున్న ఐఎల్‌-76 విమానం ద్వారా  ఏడు టన్నుల బరువును జారవిడిచారు. సామగ్రి సురక్షితంగా ఉపరితలానికి చేరిందని అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ భద్రతా బలగాలకు ఎం తగానో ఉపయోగపడుతుందన్నారు. 


logo