మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 15, 2020 , 00:21:13

రోడ్డు ప్రమాదంలో జింక మృతి

రోడ్డు ప్రమాదంలో జింక మృతి

కొండాపూర్‌: రోడ్డు ప్రమాదంలో జింక మృత్యువాతపడింది. శనివారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం సీహెచ్‌ కోనాపూర్‌లో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో జింక గాయపడింది. సర్పంచ్‌ మాణయ్య ఆ జింకను చికిత్స నిమిత్తం పశువుల దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందింది. అటవీ అధికారులు జింక కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించగా, సీహెచ్‌ కోనాపూర్‌ శివారులో ఖననం చేశారు.


logo
>>>>>>