బుధవారం 27 మే 2020
Telangana - May 11, 2020 , 00:50:48

రాష్ట్రంలో తగ్గిన శిశుమరణాలు

రాష్ట్రంలో తగ్గిన శిశుమరణాలు

  • ఫలితమిస్తున్న సర్కారు ప్రయత్నం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మాతాశిశు మరణాల నియంత్రణలో భాగంగా ప్రభు త్వం అమలుచేస్తు న్న కేసీఆర్‌ కిట్లు, ఇతర ఆరోగ్య కార్యక్రమాలు సత్ఫలితాన్నిస్తున్నాయి. గతంతో పోలిస్తే మన రాష్ట్రంలో శిశుమరణాల రేటు గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం (ఎస్‌ఆర్‌ఎస్‌) సర్వే ఆధారంగా ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం ప్రతి వెయ్యి జనాభాకుగాను శిశుమరణాల రేటు జాతీయస్థాయిలో 32శాతం ఉండగా, తెలంగాణలో 27గా ఉన్నది. ఇది గతేడాది కంటే రెండు శాతం తక్కువ. ఈ 27శాతంలో ఆడ శిశువుల్లో 26, మగశిశువుల్లో 27గా ఉన్నది. శిశు మరణాల రేటు పట్టణాల్లో 21, గ్రామాల్లో 30గా ఉన్నట్టు గుర్తించారు. నవజాత శిశువుల ఆరోగ్య రక్షణకు సర్కారు దవాఖానల పరిధిలో 29 ఎస్‌ఎన్‌సీయూలను నిర్వహిస్తున్నది. ఫలితంగానే శిశుమరణాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. ఇంద్రధనుష్‌ ద్వారా ఇంటింటికీ టీకాల అమలులోనూ తెలంగాణ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందడం విశేషం.


logo