బుధవారం 03 మార్చి 2021
Telangana - Jan 24, 2021 , 21:17:12

పురుషుల్లో ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గించండిలా..

పురుషుల్లో ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గించండిలా..

వయసులో ఉన్న పురుషుల్లో చాలా మందికి టెస్టోస్టెరాన్ తక్కువగా ఉండటం అనేది సాధారణ సమస్య. ఇది తక్కువగా ఉండటం వల్లే వారిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఈ హార్మోన్ స్థాయి పెరగడం వల్ల పురుషుల్లోనే కాదు స్త్రీలలోనూ గుండె జబ్బులు, కొన్నిరకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. దీని పెరుగుదలను నిరోధించాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. దీనికి చేయాల్సిందల్లా కొన్ని రకాల ఆహారాలను తినడం. ఫైటోకెమికల్స్ కలిగిన ఆహారాలను తినడం వల్ల రక్తంలో పెరుగుతున్న ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గించవచ్చట. 

మరి ఫైటోకెమికల్స్ ఉండే ఆ ఆహారాలేంటో తెలుసుకుందాం రండి..

1. క్రూసిఫరస్ కూరగాయలు :  క్రూసిఫరస్ కూరగాయలు ఈస్ట్రోజెన్ స్థాయిలను నిరోధించడానికి ఉత్తమ ఔషధంగా పరిగణించవచ్చు. అంటే కాలిఫ్లవర్, బ్రోకలీ, క్యాబేజీ, టర్నిప్స్, బ్రస్సెల్స్ మొలకలు, బోక్ చోయ్ లాంటి వాటిలో ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ స్థాయిలను నిరోధించే సహాయపడతా.

2. పుట్టగొడుగులు :  పుట్టగొడుగులు కూడా ఈస్ట్రోజెన్ స్థాయిని చక్కగా అడ్డుకుంటాయి. క్రిమినీ, బేబీ బటన్, పోర్టోబెల్లో వంటి కొన్ని రకాలు అరోమాటేస్ ఉత్పత్తిని నిరోధించడంతోపాటు ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తాయి. ఆరోమాటాస్ అనే ఎంజైమ్ ఆండ్రోజెన్ హార్మోన్‌ను ఈస్ట్రోజెన్‌గా మారుస్తుంది.

 3.ఎర్ర ద్రాక్ష : ఈస్ట్రోజెన్-నిరోధించే ఆహారాలలో ఎర్ర ద్రాక్షను ముందు వరుసలో ఉంచవచ్చు. ఇవి ఆరోగ్యానికి ఇతర ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి.

4. విత్తనాలు : నువ్వులు, అవిసె వంటి కొన్ని రకాల విత్తనాలు కూడా ఈస్ట్రోజెన్ స్థాయిని తగ్గిస్తాయి. ఈ విత్తనాలలో సూక్ష్మపోషకాలు,  మొక్కల నుండి తీసుకోబడిన పాలీఫెనాల్స్ ఉంటాయి.

5. తృణధాన్యాలు : గోధుమ, బియ్యం, వోట్స్, మొక్కజొన్న లాంటి తృణధాన్యాలు కూడా ఈస్ట్రోజెన్ లెవెల్స్ ను నిరోధించేందుకు బాగా సహాయపడతాయి.  బార్లీ కూడా ఈస్ట్రోజెన్ స్థాయిని తగ్గిస్తాయి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo