సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 19:22:33

కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి

కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి

జయశంకర్ భూపాలపల్లి : కాళేశ్వరం, లక్ష్మీ బరాజ్‌కు గోదావరి నదీ ప్రవాహం గురువారం తగ్గుముఖం పట్టింది. గురువారం ఉదయం 61,9000 క్యూసెక్కులు ఉన్న ప్రవాహం సాయంత్రానికి 49,6,300 క్యూసెక్కులకు చేరింది. అలాగే అన్నారం(సరస్వతి) బరాజ్‌కు మానేరు, గోదావరి నది నుంచి 8,600 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుండగా రెండు గేట్లు ఎత్తి 8,600 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.

బరాజ్‌లో ప్రస్తుతం 08.77 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. లక్ష్మీ బరాజ్‌లో 3.460 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ఇంజినీరు అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి 4,96,300 ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా 75 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదలడంతో 4,96,300 ఔట్‌ఫ్లో వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. 


logo